‘మెహబూబా’ నుండి మొదటి పాట !

‘మెహబూబా’ నుండి మొదటి పాట !

Published on Apr 14, 2018 1:06 PM IST

ఆకాష్ పూరి హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన చిత్రం ‘మెహబూబా’. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంది. దీంతో టీమ్ రెట్టించిన ఉత్సాహంతో ప్రమోషన్లు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఈ నెల 16వ తేదీన సాయంత్రం 5 గంటలకు సినిమాలోని మొదటి పాట ‘ఓ ప్రియా నా ప్రియా’ ను రిలీజ్ చేయనున్నారు.

సందీప్ చౌత సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని పూరి స్వయంగా నిర్మించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయనున్నారు. 1971 ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నైపథ్యంలో నడిచే ప్రేమ కథగా ఉండనున్న ఈ సినిమాలో నూతన నటి నేహా శెట్టి కథానాయకిగా కనిపించనుంది. మే 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

తాజా వార్తలు