మే నెలలో విడుదలకానున్న పూరి ‘మెహబూబా’ !

స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ప్రస్తుతం తన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా ‘మెహబూబా’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. చిత్రీకరణ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 1971 ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నైపథ్యంలో నడిచే ప్రేమ కథగా ఉండనున్న ఈ సినిమాలో నూతన నటి నేహా శెట్టి కథానాయకిగా నటిస్తోంది.

ఈ చిత్రాన్ని మే 11న వేసవి కానుకగా విడుదలచేయనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం యొక్క ప్రపంచవ్యాప్త విడుదల హక్కుల్ని సొంతం చేసుకున్నారు. సొంత బ్యానర్ పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ చౌత స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్ కు కూడ మంచి స్పందన లభించింది.