సినిమా హిట్టైన ఆ హీరోయిన్ కు అవకాశాలు రావడం లేదు !

Published on Apr 26, 2019 4:00 am IST

కృష్ణగాడి వీర ప్రేమ గాథ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. ఈ సినిమా తరువాత మహానుభావుడు , రాజా ది గ్రేట్ రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్లు రావడంతో మెహ్రీన్ కు వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే ఈరెండు సినిమాల తరువాత చేసిన నాలుగు సినిమాలు ప్లాప్ కావడంతో ఆఫర్లు కరువయ్యాయి. అలాంటి టైం లో తనకు రాజా ది గ్రేట్ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి మళ్ళీ ఎఫ్ 2 లో అవకాశం ఇచ్చాడు.

ఈసినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్ అవ్వడంతో పాటు నటిగా మెహ్రీన్ కు మంచి పేరును తెచ్చిపెట్టింది. దాంతో మెహ్రీన్ టాలీవుడ్ లో మళ్ళీ బిజీ అవుతుందనుకుంటే అనూహ్యంగా ఆమె చేతిలో ప్రస్తుతం ఒక్కఆఫర్ కూడా లేదు. మరి దాంతో మెహ్రీన్ టాలీవుడ్ కు గుడ్ బై చెపుతుందా లేక క్రేజీ ఆఫర్ ను రాబట్టుకొని టాలీవుడ్లో బిజీ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :