పెళ్లిపై షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించిన మెహ్రీన్..!

Published on Jul 3, 2021 5:30 pm IST

హీరోయిన మెహ్రీన్ పీర్జాదా తన పెళ్లిపై షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించింది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్‌కు పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత మార్చిలో జైపూర్‌ వేదికగా నిశ్చితార్థం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఉన్నట్టుండి ఏమైందో తెలీదు కానీ తాజాగా ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు మెహ్రీన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

అయితే మేమిద్దరం ఇష్టపూర్వకంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని, ఇకపై భవ్య బిష్ణోయ్‌ మరియు అతని కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండబోదని మెహ్రీన్ తేల్చి చెప్పింది. అయితే తన వ్యక్తిగత అంశంపై తాను తీసుకున్న నిర్ణయాన్ని తన అభిమానులు, శ్రేయోభిలాషులు అర్ధం చేసుకుంటారని భావిస్తున్నట్టు మెహ్రీన్ పేర్కొంది. అయితే నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్ ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎఫ్‌2’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ఎఫ్‌3’ సినిమాలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :