వరుణ్ తేజ్ సరసన మెహరిన్ ?

వరుణ్ తేజ్ సరసన మెహరిన్ ?

Published on Mar 28, 2018 10:00 AM IST

వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న మల్టిస్టారర్ సినిమాలో మెహరిన్ నటించే అవకాశాలున్నట్లు సమాచారం. వరుణ్ తేజ్ సరసన ఈ హీరోయిన్ యాక్ట్ చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో వెంకటేష్ తో తమన్నా జడీకట్టనుంది. కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. మొదటిసారి అనిల్ రావిపూడి దేవితో వర్క్ చెయ్యబోతున్నాడు.

‘ఎఫ్2’ పేరుతో ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు. స్క్రిప్ట్స్ వర్క్స్ జరుగుతున్న ఈ మూవీ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీ తో పాటు తేజ దర్శకత్వంలో ఒక సినిమా బాబితో మరో సినిమా చెయ్యబోతున్నాడు వెంకటేష్. బాబి సినిమాలో నాగ చైతన్య నటించబోతున్నాడు. చైతు , వెంకి ఈ సినిమాలో మామ, అల్లుళ్ళుగా కనిపించబోతున్నారు.

తాజా వార్తలు