మెహ్రీన్ కూడా మొదలు పెడుతుందట !

Published on Sep 3, 2018 11:36 am IST


సమంత , కీర్తి సురేష్, అనుపమ మొదలగు కథానాయికలంతా ఇప్పుడు స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవాడిని ఆసక్తిని చూపిస్తున్నారు. ఈజాబితాలో తాజాగా పూజా హెగ్డే చేరింది. ఆమె నటిస్తున్న ‘అరవింద సమేత’ కు స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఇక ఇప్పుడు మరో కథనాయిక ఈజాబితాలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తుంది. ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది నటి మెహ్రీన్. ఇప్పటివరకు 7సినిమాలు చేసిన ఒక్క చిత్రానికి కూడా డబ్బింగ్ చెప్పుకోలేకపోయింది.

మెహ్రీన్ స్వతహాగా పంజాబీ అమ్మాయి కావడం వల్ల తెలుగు నేర్చుకోవడం ఆమెకు కష్టమే అయినా కూడా ఎట్టకేలకు తన గొంతును వినిపించడానికి సిద్దమవుతుంది. వెంకీ,వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న’ఎఫ్ 2′ అనే చిత్రంలోవరుణ్ కు జోడిగా నటిస్తుంది మెహ్రీన్. ఈసినిమాలో తన పాత్రకు స్వంతంగా డబ్బింగ్ చెప్పాలని ఉందని అంటుంది ఈ హీరోయిన్. అందుకు దిల్ రాజు, అనిల్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో ఆమె రోల్ ఎంటర్టైనింగ్ వుండనుందట.

సంబంధిత సమాచారం :