‘మెరిసే మెరిసే’ మూవీ థియేటర్లలోనే.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Jul 18, 2021 3:01 am IST


‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా, పవన్ కుమార్ కె. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెరిసే మెరిసే’. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. అయితే ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 6న పీవీఆర్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలో విడుదల చేసేందుకు రెడీ అయినట్టు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్ కె మాట్లాడుతూ ‘మెరిసే మెరిసే’ సినిమాను చాలా అద్భుతంగా, అంకున్నట్టుగానే తెరకెక్కించామని, సెన్సార్ వాళ్ళు కూడా సినిమా చూసి అభినంధించి యూఏ సర్టిఫికెట్ ఇచ్చారని అన్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను విడుదల చేసిన పీవీఆర్ సంస్థ మా సినిమాను రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, సినిమా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని అన్నారు.

సంబంధిత సమాచారం :