మెర్సల్ విడుదల ఎప్పుడంటే !
Published on Sep 11, 2018 5:32 pm IST

అట్లీ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ నటించిన చిత్రం ‘మెర్సల్’. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం సుమారు రూ 200కోట్ల పైచిలుకు వసూళ్లను రాబట్టి బ్లాక్ బ్లస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈచిత్రంలో విజయ్ మూడు పాత్రల్లో నటించగా సమంత, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తేనాండాళ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని 120 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. తెలుగు లోఈ చిత్రం ‘అదిరింది’ పేరుతో విడుదలై పర్వాలేదనిపించింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం తాజాగా చైనా లో విడుదలకానుంది. ఇప్పటివరకు అక్కడ ఒక్క తమిళ సినిమాకు రిలీజ్ కాలేదు. చైనీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ హెచ్ జి సి ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందని సమాచారం. మరి తమిళ ఇండస్ట్రీ నుండి మొట్ట మొదటి సారిగా చైనా లో విడుదలవుతున్న ఈసినిమా అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.

  • 5
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook