‘మెర్సల్’ రీమేక్ రైట్స్ మెగా ఫ్యామిలీ చేతిలో ?

1st, November 2017 - 03:57:18 PM

విజయ్ నటించిన ‘మెర్సల్’ చిత్రం తమిళనాట వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో ‘అదిరింది’ పెరటి డబ్ చేసి రిలీజ్ చేయాలనుకుని అన్ని పనుల్ని పూర్తిచేశారు నిర్మాత శరత్ మరార్. కానీ ఇప్పటి వరకు విడుదల కుదరలేదు. మరోవైపు ఈ చిత్రం యొక్క తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఒకవేళ ఇదే నిజమై అల్లు అరవింద్ గనుక రీమేక్ హక్కులు కొని ఉంటే ఈ చిత్రాన్ని ఆయన అల్లు అర్జున్ తో చేస్తారా లేకపోయితే చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లలో ఎవరో ఒకరితో చేస్తారా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయాల్లో పూర్తి క్లారిటీ రావాలంటే మెగా కాంపౌండ్ నుండి అధికారిక వివరణ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.