“లైగర్” నుంచి దీవాలి కానుకగా మైక్ టైసన్ అదిరే పోస్టర్.!

Published on Nov 4, 2021 11:11 am IST


మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా డాషింగ్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “లైగర్”. పూరి కి హిట్ ట్రాక్ అయిన బాక్సింగ్ బాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా కి మరో బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా హాలీవుడ్ అండ్ వరల్డ్ ఫేమ్ బాక్సర్ మైక్ టైసన్ ని పూరి రంగంలోకి దింపడంతో ఈ సినిమా ఇంకో స్థాయికి వెళ్ళింది.

మైక్ ఫస్ట్ ఇండియన్ సినిమా ఇదే కావడంతో చాలా ఆసక్తిగా అంతా ఎదురు చూస్తుండగా ఇప్పుడు మేకర్స్ ఈ దీపావళి కానుకగా ఓ సాలిడ్ పోస్టర్ టైసన్ ది ఇండియా కి పరిచయం చేస్తూ నమస్తే ఇండియా అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. మైక్ తన స్టన్నింగ్ పంచ్ పోస్టర్ తో ఇందులో అదిరే లెవెల్లో కమిపిస్తున్నాడు. మరి విజయ్ తో ఎలాంటి సీన్స్ ఉంటాయో కానీ ప్రతి ఒక్కరూ మాత్రం ఈ క్రేజీ కాంబో కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ భారీ సినిమాని ధర్మ ప్రొడక్షన్ వారు అలాగే ఛార్మి నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :