చరణ్ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు

చరణ్ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు

Published on Jul 30, 2015 2:14 AM IST

Ram-charan
రామ్ చరణ్ – శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఒక అన్ టైటిల్డ్ ప్రాజెక్ట్ ఒకటి తెరకెక్కుతున్న విషయం తెలిసినదే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సమాచారం ప్రకారం చరణ్ పై చిత్రీకరిస్తున్న యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కుతున్నాయట.

ఈ సినిమాకోసం చరణ్ థాయ్ లాండ్ లో ఫైట్ ల శిక్షణ పొందాడు. కోనావెంకట్ , గోపీమోహన్ ఈ సినిమాకు స్క్రిప్ట్ ని అందిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు. దానయ్య డి.వి.వి నిర్మాత. తమిళ నటులు అమితాష్ పర్ధన్, అరుణ్ విజయ్ లు ముఖ్యపాత్రలు పోషించనున్నారు. రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనువిందు చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు