“రాధే శ్యామ్” చెంతకు కళ్ళు చెదిరే డీల్స్..కానీ.?

Published on Jun 8, 2021 10:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ పీరియాడిక్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ఆల్రెడీ కంప్లీట్ అయ్యి మళ్ళీ కొంత రీషూట్ ఉండడంతో మరికొన్ని రోజులు షూట్ ప్లాన్ చెయ్యాల్సి వచ్చింది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ విషయంలో అనేక రకాల ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయి.

మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. అలా ఈ చిత్రం చెంతకు పలు ఓటిటి సంస్థలు కళ్ళు చెదిరే డీల్స్ ను తీసుకొస్తున్నారని టాక్ వినిపిస్తుంది. కొన్నాళ్ల కితం డిజిటల్ రైట్స్ పరంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ముందు రేస్ లో ఉండగా. జీ 5 వారు భారీ ధర ఈ చిత్రానికి ఆఫర్ చేసారని తర్వాత తెలిసింది.

మరి ఇప్పుడు వీరి తర్వాత కళ్ళు చెదిరే 400 కోట్ల ఆఫర్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఇచ్చారని మరో సెన్సేషనల్ గాసిప్ ఇపుడు బయటకి వచ్చింది. అయితే వీటిలో వీటిలో దీనిపై కూడా అధికారిక క్లారిటీ లేదు. కానీ అంతిమమగా మాత్రం ఈ చిత్రాన్ని మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ నే చెయ్యాలని అనుకుంటున్నారని స్ట్రాంగ్ టాక్ కూడా ఉంది.

సంబంధిత సమాచారం :