ప్రిన్స్ మహేష్ టాలీవుడ్ లో మోస్ట్ చార్మింగ్ యాక్టర్ గా ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏళ్లుగా మహేష్ అమ్మాయిల కలల రాకుమారుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే 40 ప్లస్ లోకి ఎంటరైన మహేష్ చూడటానికి మాత్రం ఇంకా కాలేజ్ కి వెళ్లే యంగ్ హీరో లానే కనిపిస్తున్నారు. తాజాగా ఆయన వోగ్ ఇండియా ఫోటో షూట్ లో పాల్గొనడం జరిగింది. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ కి సంబంధించిన ప్రముఖ మ్యాగజైన్ అయిన వోగ్ కొరకు ఇచ్చిన ఫ్యాషన్ స్టిల్స్ అదిరిపోయాయి. మల్టీ కలర్ డిజైనర్ వేర్ లో ఆయన లుక్ కేకగా ఉంది.
ఇక మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ మూవీ దాదాపు 75శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.ఇంకా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలతో పాటు, పాటలు చిత్రీకరించాల్సివుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా, దేవిశ్రీ స్వరాలు సమకూర్చుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది.
https://www.instagram.com/p/B3Tl6nhhtxp/
https://www.instagram.com/p/B3TlvVKBiPl/
https://www.instagram.com/p/B3TlM-YBupG/


