‘బాహుబలి’లో మతిపోగొట్టే సెట్టింగ్స్

‘బాహుబలి’లో మతిపోగొట్టే సెట్టింగ్స్

Published on Jun 24, 2015 8:44 AM IST

baahubali
తెలుగు చలన చిత్ర సీమతో పాటు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఎంతో గర్వించదగ్గ విధంగా హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ,మలయాళ, హిందీ ప్రేక్షకులు కూడా ఎంతగానో చూస్తున్నారు ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గత రెండున్నర ఏళ్ళుగా ఎంతో కష్టపడి చెక్కిన ‘బాహుబలి’ మొదటి పార్ట్ ‘బాహుబలి – ది బిగెనింగ్’ సెన్సార్ కూడా పూర్తి చేసుకొని జూలై 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మొదటి నుంచి చూపించిన కొన్ని ఫొటోస్ మరియు ట్రైలర్ లో చూపించిన కొన్ని సెట్స్ చూసి ఆడియన్స్ ఎంతో మెస్మరైజ్ అయ్యారు. ఇప్పటి వరకూ చూసింది చాలా తక్కువ అని సినిమాలో ఎన్నో మతిపోగెట్టే అద్భుతమైన సెట్స్ ఉంటాయని ఈ చిత్ర టీం అంటోంది. అందులో భాగంగానే రీసెంట్ గా కొన్ని సెట్స్ కి సంబందించిన స్కెచ్ లను రిలీజ్ చేసారు. అవి పేపర్ మీదే అలా ఉంటే సినిమాలో అందరి మతి పోగొడతాయని ఆర్ట్ డిజైన్స్ చూసిన వారు అంటున్నారు. మగధీరలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోనే ఓ రేంజ్ విజువల్స్ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించిన రాజమౌళి ఫుల్ లెంగ్త్ పీరియడ్ ఫిల్మ్ లో ఇండియన్ ఆడియన్స్ మనసు కొల్లగొడతాడని విశ్లేషకులు అంటున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా ప్రధాన ప్రాత్రాలు పోషించిన ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తమిళ ఆడియో రిలీజ్ ఈ రోజు చెన్నైలో జరగనుంది. అలాగే మలయాళ వెర్షన్ ఆడియో రిలీజ్ ఈ నెల 27న కేరళలో జరగనుంది.

తాజా వార్తలు