ఆర్ ఆర్ ఆర్ లో ఎవరూ ఊహించని, మతిపోయే ట్విస్ట్ అదేనా…?

Published on Oct 17, 2019 8:27 am IST

భిన్న ప్రాంతాలకు, భిన్న కాలాలకు చెందిన ఇద్దరు వీరుల కథకు ఫిక్షన్ జోడించి రాజమౌళి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ పై ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం బల్గెరియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది జులై 30న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఉద్యమ వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలలో ఎన్టీఆర్, చరణ్ లు కనిపిస్తున్నారు. కాగా ఈ మూవీ కథలో ఆసక్తికర అంశం వీరిద్దరూ వేరు, వేరు కాలాలకు చెందిన వారు కావడమే.

విశాఖ మన్యంలో బ్రిటిష్ వారిపై పోరాడిన అల్లూరి కథను, నైజాంలో నవాబుల అకృత్యాలను ఎదిరించిన కొమరం భీమ్ ల కథను ఒక మూవీలో రాజమౌళి ఎలా చూపించనున్నారు అనేది ఆసక్తికరం.ఆర్ ఆర్ ఆర్ మూవీ వాస్తవ పాత్రల ఆధారంగా తెరకెక్కుతున్న కల్పిత గాథ అని గతంలో చెప్పడం జరిగింది. అలాగే తనకు ఈ మూవీ తీయడానికి ప్రేరణ ఇచ్చిన చిత్రం మోటర్ సైకిల్ డైరీస్ అని చెప్పారు. ఇవ్వన్నీ గమనిస్తుంటే చరణ్, ఎన్టీఆర్ పాత్రలు రెండు గా కనిపించే ఒక పాత్రగా చూపిస్తారా…?మూవీలో అదే అసలు అదే ట్విస్ట్ అవుతుందా అని అనుమానం కలుగుతుంది. ఇదే కనుక నిజం ఐతే ప్రేక్షకులకు మతిపోవడం ఖాయం.

సంబంధిత సమాచారం :

More