మాఫియా థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ రిలీజ్ చేసిన మంత్రి టీజీ భరత్.!

మాఫియా థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ రిలీజ్ చేసిన మంత్రి టీజీ భరత్.!

Published on Jun 21, 2026 8:04 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటులు కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు కలయికలో మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతీ కంటెంట్ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఆదివారం నాడు ‘ది రెడ్ బ్యాగ్’ టీజర్‌ను ఏపీ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ టీజీ భరత్ రిలీజ్ చేశారు.

ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. ‘లైఫ్‌లో ఇన్వైట్ చేయని గెస్టులు చాలా మంది వస్తుంటారు.. వచ్చి మన లైఫ్‌ని మార్చేస్తారు.. ఆ గెస్ట్ మనిషే అవ్వాల్సిన అవసరం లేదు.. మనల్ని పరుగెత్తించి, ఇబ్బంది పెట్టి చావు వరకు తీసుకెళ్లి వదిలిపెట్టే ఆ పిలవని అతిథి’ అనే వాయిస్ ఓవర్‌లో టీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. నలుగురు అమ్మాయిల జీవితం ఓ రెడ్ బ్యాగ్ వల్ల తలకిందులు అవుతున్నట్టుగా చూపిస్తున్నారు. అసలు ఆ రెడ్ బ్యాగ్‌లో ఏముంది? అమ్మాయిలకి ఆ బ్యాగ్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఆ రెడ్ బ్యాగ్‌తో మాఫియాకి ఉన్న లింక్ ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు.

ఈ సినిమాకి శేఖర్ మోపురి సంగీతం, ప్రియేష్ గురుస్వామి కెమెరా వర్క్, శివ శర్వాణి ఎడిటింగ్ బాధ్యతల్ని నిర్వర్తించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు