మాస్ మహారాజా రవితేజ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం ‘మిరపకాయ్’ మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. 2026 సెప్టెంబర్ 18న ఈ చిత్రాన్ని 4K డిజిటల్ వెర్షన్‌లో అత్యంత ఘనంగా రీ-రిలీజ్ చేయనున్నట్లు కేదార్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మించిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో రీచా గంగోపాధ్యాయ్, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించారు.
అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రానికి తమన్ అందించిన మ్యూజిక్, రవితేజ మార్క్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఈ అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా చిత్రాన్ని మళ్లీ బిగ్ స్క్రీన్‌పై 4K క్వాలిటీతో చూడటానికి రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
