పెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్ హీరోయిన్ !

Published on Jan 16, 2019 12:34 pm IST

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో లీడర్‌ సినిమాలో రానా సరసన హీరోయిన్ గా నటించిన రిచా గంగోపాధ్యాయ.. ఆ తరువాత మిరపకాయ్‌, మిర్చి సినిమాలతో మంచి గుర్తింపే తెచ్చుకుంది. కానీ కెరీర్‌ పీక్ లో ఉండగానే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోయింది.

కాగా తాజాగా తనకు బిజినెస్‌ స్కూల్‌లో పరిచయం అయిన జోయ్ అనే అతనితో తనకు నిశ్చితార్థం జరిగినట్టుగా రిచా గంగోపాధ్యాయ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే ఇంకా తమ పెళ్లికి ముహూర్తం ఖరారు కాలేదని, లైఫ్ లో కొత్త మార్పుకోసం సంతోషంగా ఎదురు చూస్తున్నానని రిచా గంగోపాధ్యాయ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :