ఓటిటి సమీక్ష: “మిర్జాపూర్ సీజన్ 3” – తెలుగు డబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో

ఓటిటి సమీక్ష: “మిర్జాపూర్ సీజన్ 3” – తెలుగు డబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో

Published on Jul 6, 2024 10:11 AM IST
Mirzapur Season 3 Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 05, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, ఇషా తల్వార్, విజయ్ వర్మ, రసిక దుగల్, అంజుమ్ శర్మ, రాజేష్ తైలాంగ్, హర్షిత గౌర్, నేహా షర్గం మరియు ఇతరులు

దర్శకులు: గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్

నిర్మాత : ఎక్సెల్ మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్

సంగీత దర్శకులు: ఆనంద్ భాస్కర్, జాన్ స్టీవర్ట్

సినిమాటోగ్రఫీ: సంజయ్ కపూర్, కునాల్ కురే

ఎడిట‌ర్ : సిద్ధేశ్వర్ ఏకాంబే

సంబంధిత లింక్స్: ట్రైలర్

ప్రస్తుతం ఓటిటిలో మంచి హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ ఓటిటి సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా హిందీ సిరీస్ “మిర్జాపూర్ సీజన్ 3” అనే చెప్పాలి. మరి ఈ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రిలీజ్ కి తీసుకురాగా ఈ సిరీస్ అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథలోకి వస్తే.. సీజన్ 2 మున్నా భయ్యా(దివ్యందు శర్మ) మరణం తర్వాత ఖాలీన్ భయ్యా(పంకజ్ త్రిపాఠి) ని ఒక సేఫ్ హౌస్ కి శరద్ శుక్ల(అంజుమ్ శర్మ) తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. ఈ సమయంలో మున్నా భార్య మాధురి యాదవ్(ఇషా తల్వార్) ఉత్తర్ ప్రదేశ్ కి సీఎం గా అక్కడ క్రైమ్ లేకుండా చెయ్యాలని డిసైడ్ అవుతుంది. అయితే ఇంకోపక్క గుడ్డు పండిట్(అలీ ఫజల్) మిర్జాపూర్ సింహాసనాన్ని తీసుకుంటాడు కానీ అందుకు అక్కడ బాహుబలులు అతడికి వ్యతిరేకంగా నిలబడి అడ్డుకుంటారు. ఈ సమయంలో శరద్ తో గుడ్డు లలో ఎవరు బలవంతులో నిరూపించుకోవాలని షరతు పెడతారు. మరి ఇందులో ఎవరు గెలిచి ఆధిపత్యం సాధిస్తారు? సీఎం మాధురి తాను కోరుకున్నట్టుగా క్రైమ్ లేకుండా చేస్తుందా? ఇందులో ఖాలీన్ భయ్యా పాత్ర ఎంత అనేది తెలియాలి అంటే ఈ సిరీస్ ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ పర్టిక్యులర్ వెబ్ సిరీస్ కి ఒక్క హిందీలోనే కాకుండా తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. దీనితో రెండు సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ల తర్వాత వచ్చిన మూడో సీజన్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సీజన్ కూడా వాటికి తగ్గట్టుగానే మిర్జాపూర్ అభిమానులని అలరిస్తుంది అని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లు మంచి డ్రామాతో వారికి ఫీస్ట్ ని ని అందిస్తుంది.

అలాగే ఈసారి సీజన్లో మంచి మైండ్ గేమ్ అలాగే కొన్ని పాత్రలు, వాటి తాలూకా అసలు రంగులు బయటకి రావడం వంటివి ఇంప్రెస్ చేస్తాయి. అలాగే ఈ సిరీస్ లో విజయ్ వెర్మ, రాజేష్ తల్లంగ్ అలాగే ఇషా తల్వార్ లు తమ పాత్రల్లో ఇంట్రెస్టింగ్ పెర్ఫామెన్స్ ని అందించారు. అలాగే మరికొన్ని సీన్స్ మంచి రసవత్తరంగా సాలిడ్ ఎమోషన్స్ తో కనిపిస్తాయి.

ఇక వీటితో పాటుగా ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ఫుల్ ఫీస్ట్ అని చెప్పాలి. చివరి అరగంట చాలా సర్ప్రైజింగ్ మూమెంట్స్ తో మంచి ఇంటెన్స్ గా సాగుతుంది. ఇక ఈ సీజన్లో నటీనటుల్లో అయితే అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి అలాగే అంజుమ్ శర్మలు అదరగొట్టేసారు. సిరీస్ స్టార్టింగ్ నుంచే వీరి ముగ్గురు చుట్టూ నడిచే డ్రామా కానీ అందులో వారి సెటిల్డ్ పెర్ఫామెన్స్ లో ఈ సీజన్లో హైలైట్ గా నిలుస్తాయి. అలాగే నటుడు పంకజ్ త్రిపాఠికి లిమిటెడ్ స్క్రీన్ టైం ఉంది కానీ ఉన్న కొంతలో కూడా తాను ఇంప్రెస్ చేశారు.

మైనస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో డిజప్పాయింటింగ్ అంశం ఏదన్నా ఉంది అంటే అది బాగా సాగదీత అని చెప్పాలి. దాదాపు మొదటి ఐదు, ఆరు ఎపిసోడ్స్ కూడా చాలా సాగదీతగా అనిపిస్తాయి. ఒక ఏడెనిమిది ఎపిసోడ్స్ లో కుదించేయాల్సిన సిరీస్ ని బాగా సాగదీతగా తీసుకెళ్లారు. దీనితో అసలు ఆసక్తి కలగడానికి చాలా సమయం పడుతుంది.

వీటితో ఒకింత బోర్ గా సాగుతుందని చెప్పాలి. అలాగే కొన్ని సీన్స్ ఊహించే విధంగానే ఉంటాయి అలాగే మంచి మాస్ డైలాగ్స్ లాంటివి కూడా బాగా మిస్ అయ్యాయి. అలాగే ఈసారి సీజన్లో మరింత ఎంటర్టైన్మెంట్ ని జోడించి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం:

ఈ సీజన్లో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక టెక్నికల్ టీం లో మ్యూజిక్ వర్క్ పర్వాలేదు. అలాగే లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్ లో టైటిల్ ట్రాక్ బీట్స్ ని మార్చడం బాగుంది. సినిమాటోగ్రఫీ నీట్ గా సాగింది అలాగే ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. వి ఎఫ్ ఎక్స్ బాగున్నాయి. ఇక దర్శకులు గురుమీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ ల విషయానికి వస్తే కొన్ని అనవసర సబ్ ప్లాట్ లతో కొన్ని చోట్ల బోర్ కొట్టించారు కానీ చివరి ఎపిసోడ్స్ లో మాత్రం బాగున్నాయి. వీటితో అయితే వారి వర్క్ ఈ సీజన్లో ఓకే అనిపిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈసారి సీజన్ మొదటి రెండు సీజన్లతో పోలిస్తే మరింత బెటర్ గా అనిపించదు కానీ ఓకే అనిపిస్తుంది. అలాగే మెయిన్ లీడ్ అలీ ఫజల్, అంజుమ్ శర్మ, శ్వేతా త్రిపాఠీ, విజయ్ వెర్మ ల పెర్ఫామెన్స్ అలాగే వారి చుట్టూ సాగే డ్రామా బాగుంది కానీ అనవసరంగా పలు ఎపిసోడ్ ని బాగా సాగదీశారు. ఇవి పక్కన పెడితే ఈ సీజన్లో ఫ్యాన్స్ కి బాగానే అనిపిస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు