టాలీవుడ్ డెబ్యూట్ కు సిద్దమైన తెలుగు బ్యూటీ

టాలీవుడ్ డెబ్యూట్ కు సిద్దమైన తెలుగు బ్యూటీ

Published on Sep 4, 2016 11:58 AM IST

Sobhita-Dhulipala
మోడలింగ్, ఫ్యాషన్ రంగంలో గొప్ప పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ ఎట్టకేలకు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. 2013లో మిస్ ఎర్త్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఈమె ఎన్నాళ్లగానో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టాలని చూస్తోంది. ఇన్నాళ్లకు ఆమె ఆశ ఫలించి అడవి శేష్ హీరోగా చేస్తున్న ‘గూడాచారి’ చిత్రంలో హీరోయిన్ గా కనిపించబోతోంది.

శోభిత ఇప్పటికేబాలీవుడ్ లో ‘రమణ్ రాఘవ 2.0’ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ చిత్రాన్ని నూతన దర్శకులు రాహుల్ పాకాల, శశి కిరణ్ లు దర్శకత్వ భాద్యతలు నిర్వహిస్తున్నారు. అలాగ ఈ ప్రాజెక్టును అభిషేక్ పిక్షర్స్ సంస్థ నిర్మిస్తోంది. మొదట ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మను హీరోయిన్ గా అనుకోగా తరువాత ఆమె తప్పుకోవడంతో ఆ ఛాన్స్ శోభిత కు దక్కింది.

తాజా వార్తలు