‘మిస్సింగ్’ ప్రమోషనల్ సాంగ్‌ని రిలీజ్ చేసిన క్రిష్..!

Published on Oct 22, 2021 12:54 am IST


హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘మిస్సింగ్’. ఈ సినిమాని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుతుంది.

అయితే ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ ‘ఖుల్లమ్ ఖుల్లా’ను దర్శకుడు క్రిష్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించాడు. థ్రిల్లింగ్, రొమాన్స్, సస్పెన్స్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో మిస్సింగ్ సినిమాని తెరకెక్కించామని చిత్ర బృందం చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :

More