అక్షయ్ కుమార్ బెస్ట్ ఓపెనింగ్స్ కొట్టారు…!

Published on Aug 16, 2019 11:00 pm IST

స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా నిన్న విడుదలైన మిషన్ మంగళ్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హీరో అక్షయ్ కుమార్ చిత్రాలలోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా మిషన్ మంగళ్ నిలిచింది. మొత్తంగా మిషన్ మంగళ్ 29.16కోట్ల వసూళ్లతో 2019గాను రెండవ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ లిస్టులో 42.3 కోట్లతో సల్మాన్ నటించిన భారత్ మూవీ మొదటిస్థానంలో ఉంది. గోల్డ్, టాయిలెట్, రుస్తుం చిత్రాలు మిషన్ మంగళ్ మూవీ తరువాత అక్షయ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలుగా నిలిచాయి.

మిషన్ మంగళ్ చిత్రం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మార్స్ గ్రయం పై ప్రయోగించిన మంగల్యాన్ ఉపగ్రహం విజయగాధ నేపథ్యంలో తెరకెక్కడం జరిగింది. ఈ మిషన్ సక్సెస్ తో ఇండియా అంతరిక్ష పరిశోధనలలో అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరింది. ఈ మిషన్ హెడ్ గా పనిచేసిన రాకేష్ ధావన్ పాత్రలో అక్షయ్ కనిపిస్తుండగా, ఈ ప్రాజెక్ట్ విజయంలో కీలక పాత్ర పోషించిన లేడీ సైంటిస్ట్స్ గా, విద్యా బాలన్,తాప్సి,నిత్యా మీనన్,సోనాక్షి సిన్హా,కీర్తి కొల్హారి నటించారు.

సంబంధిత సమాచారం :