రేపే మిష్టర్ చిరంజీవి వెబ్ సైట్ ప్రారంభం…ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్!

Published on Oct 18, 2021 3:00 am IST

మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమ లో ఉంటూనే, కష్ట సమయాల్లో ప్రజలకు తోచిన సహాయం చేస్తున్నారు. కరోనా వైరస్ లాంటి మహమ్మారి విపత్తు సమయం లో కూడా మెగాస్టార్ చిరంజీవి ఇరు రాష్ట్రాలకు ఎంతో సహాయం చేశారు. ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ ను పెట్టబోతున్నారు. చారిటబుల్ ట్రస్ట్ మరియు మిష్టర్ చిరంజీవి వెబ్ సైట్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రస్ట్ ను మరియు వెబ్ సైట్ ను రేపు ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలు మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వద్ద మొదలు పెట్టనున్నారు. అంతేకాక ఇందుకు సంబంధించిన విషయాలను మీడియా తో వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హాజరు కానున్నారు. పలు కార్యక్రమాల్లో తండ్రికి చేదోడు గా ఉన్న రామ్ చరణ్ ఈ కార్యక్రమం లో పాల్గొనటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More