ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘బాహుబలి-2’ !


గతేడాది విడుదలై తెలుగు పరిశ్రమ చరిత్రలోనే భారీ విజయంగా నిలిచిన సినిమా ‘బాహుబలి-2’. రూ.1600 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్న ఈ సినిమా 65వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాగా నిలిచింది.

అంతేగాక సినిమాలోని ఉత్తమ విజువల్స్ కు, ఉత్తమ యాక్షన్ స్టంట్స్ కు కూడ జాతీయ అవార్డులు దక్కాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించడం జరిగింది. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, తమన్నా, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మించింది.