శంబాల : ప్రీమియర్ షో టికెట్ బుకింగ్స్ షురూ..!

శంబాల : ప్రీమియర్ షో టికెట్ బుకింగ్స్ షురూ..!

Published on Dec 22, 2025 9:00 PM IST

Shambala 3

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మిస్టిక్ థ్రిల్లర్ చిత్రం ‘శంబాల’ ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను యుగంధర్ ముని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఈ సినిమాపై మేకర్స్ పూర్తి ధీమాగా ఉండటంతో ఈ చిత్రానికి ప్రీమియర్ షోలు కూడా వేస్తున్నారు. డిసెంబర్ 24న ఈ చిత్ర ప్రీమియర్ షోలు వేస్తుండగా, తాజాగా ఈ ప్రీమియర్ షో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. నైజాంలో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అర్చన అయ్యర్, స్వసిక, మధునందన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు