జగన్ – చిరంజీవి భేటీ వాయిదా !

Published on Oct 11, 2019 1:36 am IST

మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ను శుక్రవారం ఉదయం 11 గంటలకు కలిసేందుకు అపాయింట్‌ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీ వాయిదా పడింది. మొదట శుక్రవారం ఉదయం జగన్‌ తో చిరంజీవి భేటీ కావాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల ఈ భేటీ 14వ తేదీకి వాయిదా పడింది. ఇక చిరుతో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ సైతం జగన్‌ను కలవనున్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఆయన్ను చిరు కలవనుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ మీటింగ్ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

ఫిల్మ్ నగర్ జనాలు మాత్రం ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని, ‘సైరా’ చిత్రానికి స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చినందుకుగాను కృతఙ్ఞతలు తెలిపి గవర్నర్ తమిళసైను ఎలాగైతే స్పెషల్ షోకు ఆహ్వానించారో అలాగే ముఖ్యమంత్రిని కూడా సినిమాను వీక్షించేందుకు ఆహ్వానించడానికే ఈ మీటింగ్ అని అంటున్నారు.

సంబంధిత సమాచారం :

X
More