ఆది ‘గాలిపటం’ హైలైట్స్ ఇవే.!

ఆది ‘గాలిపటం’ హైలైట్స్ ఇవే.!

Published on Aug 7, 2014 8:42 AM IST

Gaalipatam

యంగ్ హీరో ఆది తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ట్రై చేసిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘గాలిపటం’. ఈ సినిమా ఆగష్టు 8న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సార్ బోర్డు నుంచి ‘ఏ’ సర్టిఫికేట్ అందుకున్నఈ సినిమా తెలుగు చిత్రసీమకి చాలా కొత్తగానూ మరియు ఫ్రెష్ గాను ఉంటుందని ఈ చిత్ర మేకర్స్ అంటున్నారు.

‘గాలిపటం’ హీరో ఆది ఈ మూవీ గురించి మాట్లాడుతూ ‘సెన్సార్ వారు సినిమా సెకండాఫ్ చాలా బాగుందని అన్నారు. నా పరంగా అయితే ఈ మూవీ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అవుతాయని’ అన్నారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా సంపత్ నంది అసిస్టెంట్ నవీన్ గాంధీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆది సరసన రష్యన్ మోడల్ క్రిస్టిన అఖీవ, ఎరికా ఫెర్నాండెజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, ప్రీతి రానా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భీమ్స్ సెసిర్లో సంగీతం అందించాడు.

తాజా వార్తలు