సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజి లో ఉంది. ఈ సినిమాలో క్యాతరిన్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు కీర్తి సురేష్ ను ఈ సినిమా కోసం అడిగినట్లు తెలుస్తోంది. మొదటిసారి కీర్తి సురేష్ రవితేజతో నటిస్తుండడం విశేషం.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా తమిళ్ లో విజయం సాధించిన తెరి సినిమాకు రీమేక్ గా రూపొందించబడుతోంది. సంతోష్ శ్రీనివాస్ గతంలో కందిరీగ, రబస, హైపర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. మొదటిసారి రవితేజతో ఈ డైరెక్టర్ వర్క్ చెయ్యబోతున్నాడు. రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలోఒక సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ కృష్ణ తో చేస్తున్న నేల టికెట్ షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది.
