స్టార్ హీరోతో సినిమాకు సిద్దమవుతున్న క్రిష్ !
Published on Feb 21, 2018 4:26 pm IST

విలక్షణ దర్శకుడు క్రిష్ ప్రస్తుతం కంగనా రనౌత్ తో ‘మణికర్ణిక’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ముగియక ముందే తర్వాతి ప్రాజెక్టుకు సిద్దమవుతున్నాడు క్రిష్. తెలుగులో ఒక స్టార్ హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టిన ఈ దర్శకుడు ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్ ను కూడ రిజిస్టర్ చేయించారట.

టైటిల్ పాత ఫార్మాట్లోనే ఉన్నా సినిమా మాత్రం పూర్తి కమర్షియల్ హంగులతో నిండి ఉంటుందని, సాంకేతికంగా కూడ ఉన్నత స్థాయిలో ఉంటుందని అంటున్నారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాను ఆగష్టులో లాంచ్ చేయనున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలల్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

 
Like us on Facebook