టర్కీలో భయంకర అనుభవాలు ఎదుర్కొన్న లవ్లీ యూనిట్

టర్కీలో భయంకర అనుభవాలు ఎదుర్కొన్న లవ్లీ యూనిట్

Published on Feb 12, 2012 7:29 PM IST

బి. జయ డైరెక్షన్లో బిఎ రాజు నిర్మిస్తున్న చిత్రం లవ్లీ. ఆది హీరోగా శాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే టర్కీలో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చింది. అక్కడ రెండు పాటలు చిత్రీకరణ షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రానికి సంబందించిన ప్రెస్ మీట్ ఈ రోజు జరగగా బిఎ రాజు మాట్లాడుతూ రెండు పాటలు అధ్బుతంగా చిత్రీకరించామని అన్నారు. అలాగే అక్కడ భయంకరమైన అనుభవాలు కూడా ఎదురయ్యాయి. -14 డిగ్రీ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చాలా ఇబ్బంది ఎదురైందని, అయిన షూటింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది అన్నారు. ఆది మరియు శాన్వి ఇద్దరు బాగా నటించారని చిత్రం తప్పకుండ హిట్ అవుతుందన్న నమ్మకం తనకుందన్నారు బి.జయ. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో త్వరలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు