ఈ నెల 24న లవర్ ఆడియో విడుదల !

ఈ నెల 24న లవర్ ఆడియో విడుదల !

Published on Jun 22, 2018 10:00 PM IST

గత కొంత కాలంగా వరస పరాజయాలతో కెరీర్ ను సంక్షోభంలో పడేసుకున్నాడు యువ హీరో రాజ్ తరుణ్. ‘రాజుగాడు’ సినిమాతోనైనా విజయం సాధించి మళ్ళి సక్సెస్ ట్రాక్ ఎక్కాలనుకున్న ఆయన ఆశలు ఆ సినిమాతో కూడా తీరలేదు . ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది .

ఇక ప్రస్తుతం అయన ‘లవర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు .కొద్దీ రోజుల క్రితం ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ నెల 24న ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను గ్రాండ్ గా ప్లాన్ చేశారు .అన్నీష్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన రిద్ధి కుమార్ నటిస్తుంది . ప్రముఖ బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఫై దిల్ రాజు సమక్షంలో హర్షిత్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జులై రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు