శ్రీకాంత్ సినిమాలో మంచు మనోజ్ గెస్ట్ రోల్ !
Published on Feb 22, 2018 12:48 pm IST

హీరో మంచు మనోజ్ ఈ మధ్య గెస్ట్ రోల్స్ బాగానే చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన తరుణ్ యొక్క ‘ఇది నా లవ్ స్టోరీ’ సినిమాలో చిన్న పాత్ర చేసిన ఈయన ఇప్పుడు సీనియర్ హీరో శ్రీకాంత్ యొక్క తదుపరి చిత్రం ‘ఆపరేషన్ 2019’ సినిమాలో కూడా అతిధి పాత్ర చేస్తున్నాడు.

ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో శ్రీకాంత్ మాట్లాడుతూ మనోజ్ ఈ సినిమాలో పోలీస్ పాత్ర చేస్తున్నాడు. ఒక ఫైట్ సీన్లో కనిపిస్తాడు. ఈ నెల 26 నుండి 3 రోజులపాటు షూటింగ్లో పాల్గొంటున్నాడు అన్నారు. కరణం బాబ్జి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook