చాలా కాలం తర్వాత ఒక మీడియం రేంజ్ సినిమా ధైర్యం చేసి ఈ కోవిడ్ పరిస్థితుల్లో విడుదలకు రెడీ అవుతుంది. అదే సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”. లేటెస్ట్ గా వచ్చిన టీజర్ తో మంచి రెస్పాన్స్ ను అందుకొని మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రిస్మస్ సందర్భంగా విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాను ఉద్దేశించి సాయి తేజ్ మావయ్య మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక పోస్ట్ ను పెట్టారు. ముందుగా విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే లాక్ డౌన్ తర్వాత విడుదల కాబోతున్న మొదటి సినిమా కావడంతో ఇది ఒక ముఖ్యమైన సందర్భంగా ప్రస్తావించారు.
అంతే కాకుండా ఈ చిత్రానికి నిస్సందేహంగా మంచి ఆదరణ లభిస్తుంది అని ధీమా వ్యక్తం చెయ్యడమే కాకుండా ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటిస్తూ ఈ చిత్రాన్ని థియేటర్ లో ఎంజాయ్ చెయ్యాలని భాద్యతాయుతమైన పోస్ట్ పెట్టి చిత్ర యూనిట్ కు మరింత అండగా నిలిచారు. యువ దర్శకుడు సుబ్బు తెరిక్కించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణం వహించారు.
#StaySafe#SBSBOnDec25th#CelebratingCinema#ReturnOfTeluguCinema #BigScreenEntertainment @IamSaiDharamTej @SVCCofficial pic.twitter.com/NrKwy4u3r0
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2020


