నిఖిల్ సరసన మేఘా ఆకాష్ ?
Published on Feb 12, 2018 4:48 pm IST

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’ని తెలుగులో ‘కిరాక్ పార్టీ’గా రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఇది వరకే విడుదలవ్వాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పెండింగ్ ఉండటంతో వాయిదాపడింది. దీని తర్వాత ఆయన మరొక రీమేక్ చేయనున్నాడు. అదే ఆత్రవా నటించిన ‘కనితన్’. త్వరలో ఈ రీమేక్ పట్టాలెక్కనుంది.

ముందుగా ఈ చిత్రంలో ఒరిజినల్ వెర్షన్లో నటించిన క్యాథరిన్ థ్రెస హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు రాగా ఆమె వాటిని ఖండించింది. ఇప్పుడు తాజాగా ‘లై’ ఫేమ్ మేఘా ఆకాష్ ఈ చిత్రంలో నటిస్తుందని అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవముందో తేలాలంటే ప్రాజెక్ట్ సంబంధీకులు ఎవరావు ఒకరు అధికారిక ప్రకటన ఇచ్చే వరకు ఆగాలి. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మించనున్నారట.

 
Like us on Facebook