ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును పొందిన ‘ఘాజి’ !

13th, April 2018 - 03:30:01 PM


2017 లో తెలుగు సినీ పరిశ్రమ సొంతం చేసుకున్న విజయాల్లో ‘ఘాజి’ కూడ ఒకటి. మొట్ట మొదటి సబ్ మెరైన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అప్పట్లో బ్రహ్మాండమైన వసూళ్లను సాదించడమేగాక తాజాగా ప్రకటించిన 65వ జాతీయ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డును కైవసం చేసుకుంది.

దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన మొదటి చిత్రంగా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రానా, అతుల్ కులకర్ణి, కె. కె. మీనన్, తాప్సి, రాహుల్ సింగ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. పివి, మాటినీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఇకపోతే ‘టూ లెట్’ ఉత్తమ తమిళ చిత్రంగా అవార్డును దక్కించుకుంది.