సమీక్ష : పెదవి దాటని మాటొకటుంది – ప్రేక్షకుని మదిని తాకలేకపోయింది

Pedavi Datani Matokatundhi movie review

విడుదల తేదీ : జులై 27, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : రావణ్ రెడ్డి, పాయల్ వాద్వా, నరేష్

దర్శకత్వం : గురు ప్రసాద్

నిర్మాతలు : అదితి, కీర్తి కుమార్

సంగీతం : జెనిత్ రెడ్డి

సినిమాటోగ్రఫర్ : నమన్, యతిన్

ఎడిటర్ : నిర్మల్ కుమార్

రావన్ రెడ్డి, పాయల్ వాద్వా హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు గురు ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘పెదవి దాటని మాటొకటుంది’. ట్రైలర్ తో మంచి ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

చదువు అంటే అసలు ఇష్టం లేని తరుణ్ (రావన్ రెడ్డి )కి మ్యుజిషియన్ కావాలనే లక్ష్యం మాత్రం గట్టిగా ఉంటుంది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నే క్రమంలో ఖర్చులకోసం ఓ సాఫ్ట్ వెర్ కంపెనీ లో జానిటర్ (బిల్డింగ్ క్లినర్ )గా జాయిన్ అవుతాడు. ఐతే స్కూల్ డేస్ లోనే అహనా (పాయల్ వాద్వా ) తరుణ్ ను చూసి ఇష్టపడుతుంది. ఈ విషయాన్నీ తరుణ్ కు చెప్తే తన లుక్ బాగోలేదని ఎగతాళిగా కామెంట్ చేసి తనను అవాయిడ్ చేస్తాడు. దాంతో దాన్ని సీరియస్ గా తీసుకున్న అహనా అందంగా తయారవుతుంది.

ఇక అప్పటినుండి తరుణ్, అహనాను ఇష్టపడడం మొదలు పెడుతాడు. ఈ విషయాన్నీ ఆమెకు చెప్పేందుకు ఎంతో ట్రై చేస్తాడు గాని, చెప్పలేకపోతాడు. దానికి కారణం తను కుపిడ్ (ప్రేమ జంటలను కలుపుతారు తప్ప, తమ ప్రేమను అవతలవారికి చెప్పుకోలేరు) అనే డిజార్డర్ తో బాధపడుతున్నాని తెలుసుకుంటాడు. మరి ఆ తరువాత దాని నుండు బయట పడ్డాడు ? అహనాకు తన ప్రేమను ఎలా వ్యక్త పరిచాడు ? చివరకి అహనా, తరుణ్ కలిసారా లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ‘పెదవి దాటని మాటొకటుంది’ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మొదటి సారి హీరోగా నటించిన రావన్ రెడ్డి లుక్స్ పరంగా యావరేజ్ గా ఉన్న నటన పరంగా బాగానే ఆకట్టుకున్నాడు. తన ఎనర్జిటిక్ పెరఫార్మెన్స్ తో తరుణ్ పాత్రకు న్యాయం చేశాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన
మొయిన్ తన కామెడీ టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు.

అలాగే హీరోగా నటించిన పాయల్ వాద్వా అటు సగటు అమ్మాయిలా, ఇటు అందంగా కనిపిస్తూ బాగానే ఆకట్టుకుంది. అక్కడక్కడ హీరో హీరోయిన్ల మధ్య నడిచే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి.

ఇక సీనియర్ నరేష్ హీరో తనదైన శైలిలో తండ్రి పాత్రలో అలోవోకగా నటించుకుంటూ వెళ్లిపోయారు. వీళ్ల ముగ్గురి కలయికలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా నరేష్ తన కామెడీ టైమింగ్‌ తో తన నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

కుపిడ్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ రాసుకున్న దర్శకుడు గురు ప్రసాద్ ఆ కాన్సెప్ట్ ను అంతే బాగా తెర మీదకు ఆసక్తికరంగా మలచలేకపోయారు. ప్రధానంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ కాన్సెప్ట్ తో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులకు చాలా వరకు విసుగు తెప్పిస్తాయి తప్ప ఆకట్టుకోవు.

ఇక హీరో క్యారెక్టైజేషన్ కూడా అంత బలంగా లేదు. ప్రేమతో పాటు హీరో తన లక్ష్యాన్ని కూడా ఎలా సాధించాడు అనే విషయాన్ని కూడా క్లారిటీగా చూపెడితే బాగుండేది. డైరెక్టర్ ఆ విషయాన్ని మర్చిపోయి కేవలం ప్రేమ మీదనే ఫోకస్ చేయడంతో సినిమా అంతా బోరింగ్ గా సాగుతుంది.

అయినా ఎంత చదువు లేకపోతే మాత్రం హీరోను జానిటర్ గా చూపెట్టడం, ఆ నేపథ్యంతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష పెడతాయి. ఇక సినిమాలో నరేష్ తప్ప ఎవరు తెల్సిన వారు లేకపోవడం వారి హావభావాలు, నటన కూడా ఇబ్బందిగా అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు మంచి కాన్సెప్ట్ ని తీసుకున్న దాన్ని తెర మీద చూపెట్టడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ను ప్రారభించిన గురు ప్రసాద్ ఈ చిత్రాన్ని కూడా అలాగే తెరకెక్కించాడు. కాకపోతే కొంచెం నిడివి ఎక్కువ అంతే. కమర్షియల్ అంశాల జోలికీ పోకుండా తక్కువ బడ్జెట్లో ప్రేక్షకులకు ఒక మంచి సినిమాను అందించాలాని ఆయన చేసిన ఈ ప్రయత్నం చాలా వరకు బెడిసి కొట్టింది.

నమన్ , యతిన్ అందించిన చాయాగ్రహణం బాగుంది . జెనిత్ రెడ్డి అందించిన నేపధ్య సంగీతం, పాటల సంగీతం పర్వాలేదు అనిపిస్తాయి. ఎడిటర్ పనితరం సరిగా లేదు. నిర్మాతలు చిత్రంపై ఇంకాస్త శ్రద్ద వహించి ఉండాల్సింది.

తీర్పు :

కుపిడ్ అనే డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం సఫలం కాలేకపోయింది. మొత్తంగా ఆకట్టుకోలేకపోయిన కథనం, కనీస స్థాయిలో కూడ లేని దర్శకత్వం, ఇంప్రెస్ చేయలేకపోయిన సన్నివేశాలు, పాత్రలు అన్నీ కలిసి ప్రేక్షకుడ్ని ఇబ్బందిపెట్టేలా సినిమాను తయారుచేశాయి. కాగా హీరో రావన్ రెడ్డి, నరేష్ ల నటన ఈ సినిమాలో కొంతవరకు రిలీఫ్ అని చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఓ డిఫ్రెంట్ చిత్రాన్ని చూడాలనుకునే వారు ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More