సునీల్ హీరోగా మారి అందాల రాముడు, మర్యాద రామన్న చిత్రాల తర్వాత కష్టపడి ఫ్యామిలీ ప్యాక్ గా ఉన్న తన బాడీని కష్టపడి సిక్స్ ప్యాక్ గా మార్చి చేసిన చిత్రం ‘పూలరంగడు’. అనూప్ రూబెన్స్ అందించిన ఈ చిత్ర ఆడియో హైదరాబాదులోని కత్రియ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా ఈ వేడుకకు చాలా మంది ప్రముఖులు విచ్చేసారు. ఈ చిత్ర ఆడియోలోని మొదటి పాటను ‘మిరపకాయ’ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ మరియు ఆ చిత్ర రమేష్ పుప్పాల విడుదల చేసారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ సునీల్ హీరోగా రెండు సినిమాలు చేసిన తరువాత కూడా తను అడగిన వెంటనే మిరపకాయ్’ చిత్రంలో కమెడియన్ పాత్ర వేయడానికి ఒప్పుకున్నారని అన్నారు. దర్శకుడు దేవకట్ట ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్లో ఇటీవలే విడుదలైన ‘బిజినెస్ మేన్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే ఈ పూలరంగడు అంతటి విజయం సాధించాలని కోరుకున్నారు. అలాగే ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అచ్చిరెడ్డి తను చిన్ననాటి స్నేహితులమని వారు నిర్మించిన ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హీరో ఆది మాట్లాడుతూ మాక్స్ ఇండియా బ్యానర్ పై వచ్చిన ‘ప్రేమకావాలి’ చిత్రం లాగే ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు. సునీల్ నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రం లాగే పూలరంగడు కూడా సునీల్ కెరీర్లో మర్యాద రామన్న-2 అవుతుందని అన్నారు. తన ఫిజికల్ ట్రైనర్ సలీం వల్లే తను సిక్స్ ప్యాక్ బాడీ సాధ్యమైందని హీరో సునీల్ అన్నారు. ప్రేమకావాలి తరువాత ఇదే బ్యానర్లో మళ్లీ చేస్తున్నందుకు చాలా అందంగా ఉందని ఈ సినిమా హీరొయిన్ ఇషా చావ్లా అన్నారు. అలాగే సుకుమార్, మంచు మనోజ్, గేయ రచయితలు చంద్రబోస్, అనంత శ్రీ రామ్, రామజోగయ్య శాస్త్రి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ వేడుకకు హాజరయ్యారు.
పూలరంగడు ఆడియో విడుదల
పూలరంగడు ఆడియో విడుదల
Published on Jan 18, 2012 11:51 PM IST
సంబంధిత సమాచారం
- ప్యారడైజ్ టీజర్.. జడల్ జమానా పైనే అందరి కళ్ళు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇదయం మురళి.. ఏయే భాషల్లో వస్తుందంటే..?
- ధనుష్ సరసన సీనియర్ బ్యూటీ.. సెట్ అయ్యేనా..?
- ఐకాన్ స్టార్ కోసం కింగ్ ఖాన్.. ‘రాకా’ రూమర్స్ పై క్లారిటీ ఇదే..?
- ఆఫీషియల్ : రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘రామాయణ పార్ట్ 1’..!
- ‘ఓజీ 2’ పట్టాలెక్కేది ఇక అప్పుడేనా..?
- నాగ చైతన్య కూడా అప్పుడే వస్తాడా..?
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- ‘ది ప్యారడైజ్’ టీజర్ రన్ టైమ్ ఫిక్స్.. ఎంతంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీ. ఎమన్నాడంటే..?
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- ‘రామాయణ’లో సీతాదేవి, కైకేయి లుక్స్‌పై విమర్శలు.. ట్రోల్స్‌కు కాస్ట్యూమ్ డిజైనర్ల కౌంటర్
- OTT : 4 భాషల్లో ‘ఓ..! సుకుమారి’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటినుంచంటే?
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- OTT Releases This Week: లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి.. ఓటీటీలోకి వస్తున్న కొత్త సినిమాల ఫుల్ లిస్ట్!


