మరో నాలుగు భాషల్లో ‘రంగస్థలం’ !


‘బాహుబలి’ తర్వాత అంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ‘రంగస్థలం’. రామ్ చరణ్ కెరీర్లో కూడ ‘మగధీర’ తర్వాత చాన్నాళ్లకు వచ్చిన బిగ్గెస్ట్ హిట్ ఇదే. తెలుగులో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ.103 కోట్ల షేర్ ను వసూలు చేసి అత్యధిక వసూళ్లు సాధించిన 3వ తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది.

సినిమాను తమిళ భాషలోకి డబ్ చేసే యోచనలో నిర్మాతలకు ఉన్నారని గతంలోనే చరణ్ తెలపగా ఇప్పుడు కేవలం తమిళంలోకి మాత్రమే కాకుండా హిందీ, మలయాళం, భోజ్ పురి భాషల్లోకి చిత్రాన్ని అనువదించాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ దర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.