తన భవిష్యత్తు ప్రణాళికల గురించి రవితేజ సమయం వృధా చేయ్యదలుచుకోవట్లేదనిపిస్తుంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ “దేవుడు చేసిన మనుషులు” చిత్రంలో నటిస్తున్న ఈయన ఈ చిత్రం తరువాత పరుశురాం చిత్రంలో నటించబోతున్నారు. ఈ రెండు చిత్రాలు కాకుండా మెహర్ రమేష్ తో ఒక చిత్రం ఒప్పుకున్నారు. తాజా సమాచారం ప్రకారం రవితేజ గోపీచంద్ మలినేనితో తిరిగి జత కట్టబోతున్నారు. గతంలో వీరు ఇరువురు కలిసి “డాన్ శీను” చిత్రం కోసం కలిసి పని చేశారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే సందడి చేసింది. ఈ నూతన చిత్రాన్ని పివిపి బ్యానర్ మీద ప్రసాద్ వి పోట్లురి నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ నిర్మాత తమిళ “ఈగ( నాన్ ఈ) ” చిత్రం , సెల్వ రాఘవన్ దర్శకత్వం లో “బృందావనం లో నందకుమారుడు” మరియు కమల్ హాసన్ “విశ్వ రూపం” చిత్రాలను నిర్మిస్తున్నారు. కోన వెంకట్ ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు చెబుతూ ” బ్యాంకాక్ లో రవితేజకి ఒక కథ చెప్పాము ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించబోతున్నారు ప్రసాద్ నిర్మించబోతున్నారు” అని చెప్పారు. త్వరలో చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలుస్తాయి.
మరో చిత్రం చెయ్యబోతున్న గోపీచంద్ మరియు రవితేజ
మరో చిత్రం చెయ్యబోతున్న గోపీచంద్ మరియు రవితేజ
Published on Apr 3, 2012 9:11 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : బైకర్ – రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్, రాజశేఖర్ల ఎమోషనల్ రైడ్
- ఓటీటీ లోకి వచ్చేసిన శ్రీవిష్ణు క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
- మళ్ళీ వాయిదా పడ్డ క్రేజీ కాంబో మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
- చిరు 158 పై అప్పుడే మెగా ఆశలు.. బాబీ ట్రీట్మెంట్ ఏమిటో..?
- బాక్సాఫిస్ దగ్గర ఇంట్రెస్టింగ్ పోరు.. బైకర్ vs రాకాస వార్ లో నెగ్గేది ఎవరో..?
- మెగా 158 లాంచ్ డేట్ ఫిక్స్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..!
- ‘బైకర్’కి బూస్ట్ ఇచ్చిన సెన్సార్ పాజిటివ్ రిపోర్ట్..!
- కురుక్షేత్రం : బాలయ్య కోసం ఆ డైరెక్టర్ డబుల్ ట్రీట్..?
- అదిరిపోయిన ‘పెద్ది’ కొత్త పోస్టర్.. డైలమాలో ఫ్యాన్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
- ‘బైకర్’ కి ప్రభాస్ సపోర్ట్.. ఇక రేస్ మొదలెట్టాల్సిందే..!
- వీడియో : రామాయణం – రామ గ్లింప్స్ (రణబీర్ కపూర్, సాయి పల్లవి)
- అక్కినేని హీరోతో మారుతి నెక్స్ట్ మూవీ సెట్ అయ్యేనా..?
- ఆ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ సూపర్ హీరో మూవీ..?
- ‘బైకర్’ ప్రీమియర్ షోలకు సాలిడ్ రెస్పాన్స్..!
- పెయిడ్ ప్రీమియర్స్‌కు సిద్ధమైన ‘రాకాస’.. ఎప్పుడంటే..?
- టీజర్ టాక్ : ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ డ్రామాగా ప్రదీప్ రంగనాథన్ LIK


