సమంత సినిమా రెండవ షెడ్యూల్ షెడ్యూల్ మొదలైంది !

ఇటీవలే ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సమంత ప్రస్తుతం తన ‘యు టర్న్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితమే మొదటి షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ మొదలుపెట్టుకుంది. హైదరాబాద్లోని భూత్ బంగ్లాలో వేసిన భారీ సెట్ లో జరుగుతున్న ఈ చిత్రీకరణలో సమంతతో పాటు రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టిలు కూడ నటించనున్నారు.

కన్నడలో ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగులో కూడ అదే స్థాయిలో రూపొందిస్తున్నామని నిర్మాతలు అంటున్నారు. కన్నడ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పవన్ ఈ తెలుగు వెర్షన్ ను కూడ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో సమంత జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుండగా ఆది పినిశెట్టి పోలీసాఫీసర్ పాత్రలో అలరించనున్నారు.