పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపిన మోడీ

పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపిన మోడీ

Published on May 17, 2014 2:46 PM IST

pawan-modi

భారత దేశానికి 8 వ ప్రధాన మంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ తన విజయానికి తోడ్పడిన పార్టీ కార్యకర్తలకి తనకి మద్దతు పలికిన వారందరికి ధన్యవాదాలు చెప్పే పనిలో నిమగ్నమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం తో పొత్తు కుదుర్చుకున్నబి. జె. పి సీమాంద్ర లో పూర్తి మెజారిటీ తో విజయం సాధించింది. ఈ విజయానికి మోడీ కి వున్న జనాదరణ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విసృతంగా చేసిన ప్రచారం చాలా తోడ్పడింది.

మోడీ పవన్ కళ్యాణ్ చేసిన సహాయానికి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. “ఎంతో ఉత్సాహం గా ఆంధ్ర ప్రదేశ్ అంత ప్రచారం చేసి మాకు ఎంతో తోడ్పడిన పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు” అని మోడీ ట్వీట్ చేసారు.

2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. జన సేన పార్టీ ని ప్రారంభించిన కాని ఆయన ఎన్నికల్లో పోటి చేయలేదు. ప్రస్తుతం తెలుగు దేశం మరియు బి. జె. పి అండ తో భవిష్యత్తు లో పవన్ కళ్యాణ్ వెనుతిరిగిచూడరు.

తాజా వార్తలు