శ్రీ కృష్ణదేవరాయ పురస్కారం అందుకున్న మోహన్ బాబు.

శ్రీ కృష్ణదేవరాయ పురస్కారం అందుకున్న మోహన్ బాబు.

Published on Jun 30, 2014 3:00 PM IST

mohan_babu_ssardah
ప్రముఖ సినిమా నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. శ్రీ కృష్ణదేవరాయ పురస్కారం అందుకున్నారు. ఆదివారం సాయంత్రం బెంగళూరులో 62వ తెలుగు విజ్ఞాన సమితి సంస్థాపన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, నటి శారదలను శ్రీ కృష్ణదేవరాయ పురస్కారాలతో సత్కరించారు. అవార్డు అందుకోవడం పట్ల మోహన్ బాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా న్యాయ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టిజయచంద్ర, కన్నడ – సంస్కృతి శాఖల మంత్రి ఉమాశ్రీలు హాజరయ్యారు.

తాజా వార్తలు