మనసును కలిచివేసింది – మోహన్‌ బాబు

Published on Apr 26, 2019 11:00 pm IST

తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యామన్న మనస్తాపంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డ దురదృష్ట సంఘటనల సంగతి తెలిసిందే. కొందరు విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటం మనసు కలిచివేసిందని మోహన్‌ బాబు తన బాధను వ్యక్తం చేస్తూ.. విద్యార్థి లోకానికి తన సందేశాన్ని తన ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేశారు.

మోహన్ బాబు పోస్ట్ చేస్తూ.. ‘భగవంతుడు జన్మనిచ్చింది ఆఖరి శ్వాస వరకూ జీవించడానికి.. ఆ జీవితాన్ని మార్కులు రాలేదనో, పరీక్షలో తప్పామనో ముగించుకుంటే తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు తల్లడిల్లిపోతారు. ఇది పిల్లలు అర్థం చేసుకోవాలి. ఒక విద్యాసంస్థ అధినేతగా వేల మంది విద్యార్థుల్ని అనుక్షణం నీడలా అనుసరిస్తూ, వాళ్లకు మనోనిబ్బరాన్ని కలిగిస్తున్న నాకు.. తెలంగాణ రాష్ట్రంలో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం మనసును కలచివేసింది. ప్రభుత్వం స్పందించింది.. తప్పు చేసిన వారిని శిక్షిస్తుంది. ఈలోగా దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, మీరే సర్వస్వంగా జీవిస్తున్న తల్లిదండ్రుల హృదయాలను శిక్షించకండి. వారు ఎప్పుడూ మీ ఉన్నతినే కోరుకుంటారు. వారి కోసం, వారి సంతోషం కోసం కళకళలాడుతూ వారి కళ్లముందు ఎదిగి చూపిస్తామని నిర్ణయం తీసుకోండి’ అని పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :