డైలాగ్ కింగ్ “సన్ ఆఫ్ ఇండియా” షురూ అయ్యింది.!

Published on Oct 23, 2020 11:11 pm IST


తన డైలాగ్ మాడ్యులేషన్ తో మన టాలీవుడ్ లోనే ఒక సెపరేట్ ట్రెండ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు డైలాగ్ కింగ్ మోహన్ ఇప్పుడు తనదైన పాత్రలను ఎంచుకొంటూ వస్తున్నారు. అయితే ఆ మధ్య కాలంలో అంతా మంచి పవర్ ఫుల్ రోల్స్ లో కనిపించిన మోహన్ బాబు చాలా కాలం విరామం తర్వాత చేపట్టిన మరో మోస్ట్ పవర్ ఫుల్ సినిమానే “సన్ ఆఫ్ ఇండియా”.

డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో డైలాగ్ కింగ్ ఉన్న పోస్టర్ ను ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం తాలూకా పూజా కార్యక్రమం ఈరోజు మోహన్ బాబు ఇంట్లోనే నిర్వహించి షూట్ కు కొబ్బరికాయ కొట్టేసారు. ఇక ఈరోజు నుంచే ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ను మొదలు పెట్టుకుంటుంది.

అయితే ఈ చిత్రానికి మోహన్ బాబు కూడా స్క్రీన్ ప్లే ను అందించడం విశేషం. అలాగే ఈ చిత్రాన్ని లక్ష్మి ప్రసన్న నిర్మాణం వహిస్తుండగా దర్శకుడు డైమండ్ రత్నబాబు కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి లెజెండరు సంగీత దర్శకులు మేస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చుతున్నారు. ఫైనల్ గా ఈ చిత్రంలో మోహన్ బాబు మాత్రం నెవర్ బిఫోర్ గా కనిపిస్తారని చిత్ర యూనిట్ బలంగా చెప్తున్నారు.

సంబంధిత సమాచారం :

More