‘మా’ భవనం పై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు !

Published on Aug 22, 2021 7:43 pm IST

తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు బరిలో దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) భనన నిర్మాణాన్ని నేనే స్వయంగా చేపడతాను అంటూ మంచు విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా భవన నిర్మాణంపై మంచు మోహన్‌ బాబు మాట్లాడుతూ.. ‘మా’భవనం కోసం రూపాయికి కొన్న స్థలాన్ని అర్థ రూపాయికి ఎలా అమ్మారు ? అసలు మా భవనం కోసం స్థలం కొని మళ్లీ అమ్మేయడం ఎంతవరకు సమంజసం ? అని ప్రశ్నించారు. ఈ రోజు జరిగిన ‘మా’ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో మోహన్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోహన్‌ బాబు మాట్లాడుతూ.. ‘మా’ భవనం కోసం గతంలో కొని అమ్మేసిన స్థలం గురించి పై విధంగా కామెంట్స్ చేశారు. త్వరలో మా ఎన్నికలు పెడతారని, దీని పై అభిప్రాయాలు తీసుకుని కృష్ణం రాజు నిర్ణయం తీసుకుంటారని మోహన్ బాబు తెలిపారు.

సంబంధిత సమాచారం :