వాలి, సీత లకే తప్పలేదు, మీరెంత- మోహన్ బాబు

Published on Mar 30, 2020 10:00 pm IST

కలెక్షన్ కింగ్ మోహన్ ప్రస్తుత పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించారు. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో మోడీ మాట అలాగే పెద్దల మాట వినండి అని సెలవిచ్చారు. దానికి ఉదాహరణగా రెండు పౌరాణిక పాత్రలను వారి కథలను ఉదహరించారు. యుద్దానికి వెళ్ళొద్దని భార్య వారించినా వాలి యుద్దానికి వెళ్లి మరణించాడు. లక్ష్మణుడు గీత దాటొద్దని చెప్పినా సీత గీత దాటి సమస్యల పాలైంది. కాబట్టి చెప్పిన మాట వినకపోతే వినాశనం తప్పదు. పెద్దల మాట విని ఇంటికే పరిమితం కండి ఆయన చక్కగా వివరించారు.

ప్రకృతితో పెట్టుకుంటే ఇలాంటి పరిణామాలే చూడాల్సివస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై ఓ స్పెషల్ వీడియో చేసిన మోహన్ బాబు తన అధికారిక ట్విట్టర్ లో పంచుకున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఆకాశం నీ హద్దురా మూవీలో కీలక రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More