‘మెగాస్టార్ 152’లో మోహన్ బాబు ?

Published on Feb 4, 2020 1:03 am IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘చిరు 152వ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొరటాల శివ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మోహన్ బాబును సంప్రదించినట్లు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సినిమాలో నటించడానికి మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది చూడాలి.

ఇక ఈ సినిమా పై ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఫస్ట్ షెడ్యూల్ లో కొరటాల కొన్ని ఎమోషనల్ సీన్స్ ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ లో వచ్చే ఈ సీన్స్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయట. ఈ చిత్రం కోసం మెగాస్టార్ బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి మూడు ట్యూన్లను సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ సాంగ్ ఉందట, ఈ సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు హీరో ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది. అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ తప్పకుండా ఉంటుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా అతిధి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :