మంచి తనంతో ఆకట్టుకుంటున్న ‘మంచు ఫ్యామిలీ’ !

Published on Apr 7, 2020 5:59 pm IST

కరోనా మహమ్మారితో పేద ప్రజలు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతా ఉన్నారు. ఈ కష్ట సమయంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు వారికీ అండగా నిలిచి సాయం చేస్తున్నారు. అలాగే సీనియర్ నటుడు మోహన్ బాబు తన పెద్ద కుమారుడు మంచు విష్ణుతో కలిసి చంద్రగిరి నియోజకవర్గంలోని 8 గ్రామాల వరకు దత్తత తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా దత్తత తీసుకున్న గ్రామాల్లోని పేద కుటుంబాలకు ఆర్ధిక సాయంతో పాటు ఆహారం అందిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఈ సేవలను కొనసాగిమని మంచు ఫ్యామిలీ తెలిపింది.

కాగా ఆ 8 గ్రామాల ప్రజలకు ప్రతిరోజూ 8 టన్నుల కూరగాయలను మరియు ఆహార పదార్ధాలను సరఫరా చేయడంతో పాటు ముసుగులు, శానిటైజర్లను అక్కడి ప్రజలకు అందిస్తున్నారు. మొత్తానికి మంచు ఫ్యామిలీ తమ మంచి తనాన్ని చూపించి ప్రేరణగా నిలుస్తోంది. ఇక క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకి విజృభిస్తుంది. ఈ భ‌యంక‌ర‌మైన వ్యాధి నివార‌ణ‌కు ప్ర‌భుత్వం వివిధ ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌ను అందరూ పాటించాలని మోహన్ బాబు కోరారు.

సంబంధిత సమాచారం :

X
More