సైరా అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలి – మోహన్ బాబు

Published on Oct 1, 2019 5:20 pm IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా మోహన్ బాబు సైరా పై ట్వీట్ చేస్తూ.. ‘నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్’ అని పోస్ట్ చేశారు.

ఇక ఈ సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు నటిస్తుండంతో సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More