మరో క్రేజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన మోహన్ లాల్

Published on Jul 5, 2021 1:04 pm IST

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో మోహన్ లాల్. మోహన్ లాల్ మరొక క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రకటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దృశ్యం చిత్రం లాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన దర్శకుడు జీతూ జోసెఫ్ తో మోహన్ లాల్ మరొక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 12th Man అంటూ టైటిల్ ను అనౌన్స్ చేశారు. అన్ వీలింగ్ షాడోస్ అంటూ క్యాప్షన్ జత చేయడం జరిగింది. అయితే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు ఎంతో సంతోషం గా ఉందని వ్యాఖ్యానించారు. ఈ చిత్రాన్ని ఆశీర్వాద సినీ పతాకం పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. అయితే మోహన్ లాల్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొక బ్లాక్ బస్టర్ అంటూ చెప్పుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం :